కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను టీఆర్‌ఎస్ ఎంపీలు ఇవాళ ఢిల్లీలో కలిశారు. జీఎస్టీ బకాయిలు, రాష్ర్టానికి రావాల్సిన నిధులతో పాటు తదితర అంశాలపై కేంద్ర మంత్రితో టీఆర్‌ఎస్ ఎంపీలు చర్చించారు. జీఎస్టీ బకాయిలు త్వరగా విడుదల చేయాలని ఎంపీలు కేంద్ర మంత్రిని కోరారు.
జీఎస్టీ బకాయిలు రూ.4531 కోట్లు సహా రాష్ట్రానికి రావాల్సిన రూ.29,891 కోట్ల నిధులు సత్వరమే విడుదల చేయాలని కేంద్రప్రభుత్వాన్ని టీఆర్‌ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. నిన్న పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఎంపీలు నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్షనేత నామా నాగేశ్వర్‌రావు, ఎంపీలు సంతోష్‌కుమార్, వీ లక్ష్మీకాంతరావు, బీబీ పాటిల్, పసునూరి దయాకర్, బండా ప్రకాశ్, జీ రంజిత్‌రెడ్డి, మాలోతు కవిత, ఎం శ్రీనివాస్‌రెడ్డి, బీ వెంకటేశ్, బీ లింగయ్య యాదవ్ ఉన్నారు.