రంజీ ట్రోఫీలో బెంగాల్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. రెండో సెమీ ఫైనల్లో భాగంగా కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ 174 పరుగులతో ఘన విజయం సాధించింది. కర్ణాటకపై రికార్డు విజయం సాధించిన బెంగాల్ 13ఏండ్ల తర్వాత రంజీ ఫైనల్ చేరడం విశేషం. గతంలో రెండు పర్యాయాలు టైటిల్ సాధించిన బెంగాల్ జట్టు 2017-18 సీజన్‌లో చివరిసారి సెమీ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. ఈడెన్ గార్డెన్ మైదానంలో సెమీ ఫైనల్లో కర్ణాటకను ఎదుర్కోవడానికి ఎలాంటి మార్పులు లేకుండానే బెంగాల్ బరిలో దిగింది. బెంగాల్ విజయంలో కీలక పాత్రపోషించిన మజుందార్(149 నాటౌట్:తొలి ఇన్నింగ్స్‌లో) 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు.
13ఏండ్ల తర్వాత రంజీ ఫైనల్ చేరిన బెంగాల్