ఆరోగ్యసేనకు సైన్యం సెల్యూట్‌

గనతలంలో దూసుకుపోతూ.. శత్రువులపై బాంబులు కురిపించే సైనిక విమానాల నుంచి గులాబీలు జాలువారాయి. కనిపించని కరోనా శత్రువుపై పోరాడుతున్న వైద్యవీరులకు.. దేశాన్ని రక్షించే సైన్యం అపురూప గౌరవవందనం సమర్పించింది. ఈ ఘట్టానికి గాంధీ దవాఖాన వేదికైంది. ఆదివారం ఉదయం హకీంపేట నుంచి బయలుదేరిన భారత వాయుసేన విమానం సరిగ్గా 10.23 గంటలకు గాంధీ దవాఖాన ప్రాంగణంలో పూలవాన కురిపించింది. తమకు లభించిన అపురూపమైన గౌరవానికి వైద్యలోకం పరవశించిపోయింది.